Chicago: చికాగోలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
కలష్ కాస్ట్యూమ్స్ ఆధ్వర్యంలో చికాగోలో నూతన సంవత్సర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దాదాపు 300మందికిపైగా హాజరయ్యారు. 20 మంది స్పాన్సర్లుగా వ్యవహరించారని కలాష్ కాస్ట్యూమ్స్ ఓనర్ శ్వేత కొత్తపల్లి తెలిపారు. చికాగో ఆంధ్ర సంఘానికి ఆమె గతంలో అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. అందువల్ల ఈవెంట్ ను నిర్వహించడంలో మంచి అనుభవం ఉందని చెప్పారు. దాంతోపాటు మహిళా ఎంట్రప్రెన్యూరర్ గా నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ ఇతరుల భాగస్వామ్యం లేకుండా పెట్టుబడి పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారని చెప్పారు. ఈ నూతన సంవత్సర వేడుకలు ఊహించినదానికన్నా విజయవంతమైంది. చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ వేడుకల విజయవంతానికి మాల్ ఆఫ్ ఇండియా సహకారం కూడా ఉందని అన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని మెగా బాలీవుడ్ సంగీత విభావరిని నిర్వహించారు. గాయని మాధురి పాటిబండ, గాయకులు అబ్బాస్ అలీమీర్జా, మణి తెల్లాప్రగడ బాలీవుడ్ పాటలతో అందరినీ మైమరపించారు.
మాల్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ వేడుకల విజయవంతానికి ఆర్గనైజింగ్ టీమ్ సభ్యులు శ్రీనివాస్ సుభాశ్చంద్ర బోస్, శృతి కూచంపూడి, రవి కూచంపూడి, విజయ్, సౌమ్య బొజ్జల సహకరించారని, వారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. మాధురి పాటిబండ ఈ వేడుకలకు ఎంసిగా వ్యవహరించారు. తన కుటుంబం ఇచ్చిన మద్దతు వల్లనే ఈ వేడుకలను విజయవంతం చేయగలిగానని కూడా శ్వేత కొత్తపల్లి తెలిపారు.






