Jayaram Komati: ఉత్తర అమెరికా ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జయరాం కోమటి నియామకం
అమెరికాలో తెలుగు కమ్యూనిటీ ప్రముఖునిగా ఉన్న జయరాం కోమటిని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిఎస్ శ్యామలరావు ఉత్తర్వులు వెలువరించారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెలకు 1.93లక్షల రూపాయలను అలవెన్సుల రూపంలో ప్రభుత్వం అందిస్తుంది.
గతంలో కూడా ఆయన ఈ పదవిని చేపట్టడంతోపాటు ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి పధకం పేరుతో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. అందులో ప్రభుత్వ స్కూళ్ళకు డిజిటల్ సౌకర్యాల కల్పన వంటివి ఉన్నాయి. అమెరికాలో తెలుగుదేశం పార్టీ కో ఆర్డినేటర్ గా కూడా ఉన్న జయరాం కోమటి గత ఎన్నికల్లో కూటమి విజయానికి ఎన్నారైలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించారు. ఉత్తర అమెరికాలో టిడిపి బలోపేతానికి ఆయన కృషి చేశారు. జయరాం నియామకంపై పలువురు ఎన్నారైలు, టీడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.






