Couple Freindly: ఫిబ్రవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా తెరకెక్కుతోంది.
ఈ రోజు “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హీరో హీరోయిన్స్ సంతోష్ శోభన్, మానస వారణాసి తమ సినిమా డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళంలో “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.






