Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ నుంచి జనవరి 9న టీజర్ ట్రైలర్ విడుదల
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను జనవరి 9 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులకు పవర్ఫుల్, ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుందని వారు పేర్కొన్నారు.
సమంతతో ఇది వరకు ‘ఓ బేబి’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ నందినీ రెడ్డి ..మరోసారి ఈ స్టార్ హీరోయిన్ను ‘మా ఇంటి బంగారం’లో డైరెక్ట్ చేస్తోంది. ఈ హిట్ కాంబోపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈసారి మాత్రం డిఫరెంట్ ఎమోషన్స్, స్టోరీతో, బోల్డ్‌గా, గ్రిప్పింగ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా మా ఇంటి బంగారం సినిమా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రను పోషిచటంతో పాటు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే సమంత లుక్ చాలా పవర్‌ఫుల్‌గా, ఎఫెక్టివ్‌గా కనిపించి సోషల్ మీడియాలో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఆమె పాత్రలోని ఇంటెన్సిటీ, పాత్రను తీర్చిదిద్దిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. రా, హై ఇంపాక్ట్ యాక్షన్‌తో మన భారతీయ శైలిని మిక్స్ చేసినట్లు సమంత పాత్ర అలరించనుంది. దీంతో ఆమె స్థాయి మరో రేంజ్‌కు చేరుకోనుంది. మరి జనవరి 9న రాబోతోన్న టీజర్ ట్రైలర్ ఎలా ఉండనుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.
సమంత లీడ్ రోల్ చేస్తోన్న ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తుండగా, సీనియర్ నటి గౌతమి, మంజుషా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కథనం, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను వసంత్ మారిన్గంటి, రాజ్ నిడిమోరు రచించగా, ప్రముఖ రచయిత సీతా ఆర్ మీనన్ క్రియేటివ్ సూపర్విజన్ చేస్తున్నారు.






