Tricity: ట్రిసియాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు త్వరలో..
- జనవరి 25న అల్బానీలో నిర్వహణ.. ప్రవాస భారతీయులకు ఆహ్వానం
అల్బానీ, న్యూయార్క్: భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ రాజధాని ప్రాంతంలోని తెలుగు మరియు భారతీయ సంఘం ‘ట్రిసియా’ (TRICIA – Tri City India Association) ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. 2026, జనవరి 25వ తేదీ ఆదివారం నాడు అల్బానీలో ఈ వేడుకలు జరగనున్నాయి.
కార్యక్రమ వివరాలు:
తేదీ: జనవరి 25, 2026 (ఆదివారం)
సమయం: మధ్యాహ్నం 1:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు
వేదిక: హిందూ కల్చరల్ సెంటర్ (HCC)
చిరునామా: 450 Albany Shaker Rd, Albany, NY, 12211.






