Ayaalan: ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న శివకార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ మూవీ “అయలాన్”
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ “అయలాన్” ఆహా ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కేజేఆర్ స్టూడియోస్ మరియు ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా.. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించారు. భారీ విజువల్ ఎఫెక్టులతో సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కించిన “అయలాన్” సినిమా 2024 సంక్రాంతికి తమిళనాట రిలీజై మంచి విజయం సాధించింది. తెలుగులో రిలీజ్ కు ప్లాన్ చేసినా అనివార్య కారణాలతో సాధ్యం కాలేదు.
తమిళ వెర్షన్ సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు ఆహాలో తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ కంటెంట్ ను తెలుగు ఆడియెన్స్ అందిస్తున్న ఆహా ఓటీటీ “అయలాన్” చిత్రాన్ని తాజాగా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది.






