Pragya Jaiswal: మరింత స్టైలిష్ గా కంచె బ్యూటీ
కంచె(kanche) సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal) ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అవేవీ తనను స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయాయి. అయినప్పటికీ కెరీర్ లో వెనుకడుగు వేయకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేస్తూ వస్తుంది. ఓ వైపు కెరీర్లో ముందుకెళ్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా తాజాగా ఓ వైబ్రెంట్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ లుక్ లో ప్రగ్యా వైట్ కలర్ క్రాప్ టాప్, డెనిమ్ షార్ట్స్ వేసుకుని దానికి గళ్ల చొక్కాను చుట్టుకుని ఎంతో స్టైలిష్ గా కనిపించగా, అమ్మడు ఈ ఫోటోల్లో మరింత బావుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.






