Prabhas: కావాలని రాజా సాబ్ చేశా
ప్రభాస్(prabhas) హీరోగా మారుతి(maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది రాజా సాబ్(the Raja saab). సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. జనవరి 8 సాయంత్రం నుంచే రాజా సాబ్ కు ప్రీమియర్లు వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాజా సాబ్ పై మంచి బజ్ నెలకొనగా, ఆ బజ్ ను ఇంకాస్త పెంచుతూ చిత్ర యూనిట్ ఓ ఇంటర్వ్యూని ప్లాన్ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో పాటూ ముగ్గురు హీరోయిన్లు అయిన నిధి అగర్వాల్(niddhi Agerwal), మాళవిక మోహనన్(malavika mohanan), రిద్ధి కుమార్(riddhi kumar) కూడా పాల్గొనగా, సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) ఈ ఇంటర్వ్యూని నిర్వహించారు. సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. తాను 15 ఏళ్ల కిందట డార్లింగే అనే సినిమాను చేశానని, ఆ సినిమా చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పారు.
ఇప్పుడన్నీ యాక్షన్ సినిమాలే అవడంతో బోర్ కొట్టేసి, డార్లింగ్ లాంటి సినిమా చేయాలనిపించి మారుతిని అడిగితే ఈ కథ సిద్ధం చేశాడని, రాజా సాబ్ సినిమా కచ్ఛితంగా మంచి కామెడీ హర్రర్ గా నిలుస్తుందని ప్రభాస్ చెప్పారు. రాజా సాబ్ షూటింగ్ లో మొదటి వారం రోజులు హీరోయిన్లతో మాట్లాడలేదని చెప్పిన డార్లింగ్(Darling), ఆ తర్వాత మెల్లిగా మాట్లాడటం మొదలు పెట్టానన్నారు. ఇక స్పిరిట్(spirit) ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుతూ, అది తన కెరీర్లోనే ది బెస్ట్ పోస్టర్ అని చెప్పాడు ప్రభాస్. ఇవి కాక మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.






