Chikatilo: శోభిత ధూళిపాల “చీకటిలో” – జనవరి 23న ప్రైమ్ వీడియోలో
చంద్ర పెమ్మరాజు రచనా సహకారంతో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం “చీకటిలో” సురేష్ ప్రొడక్షన్ ప్రై.లి. బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించగా ప్రైమ్ ఒరిజినల్ సినిమాగా రానుంది.
భారతదేశపు ప్రేక్షకుల అత్యంత పాత్రను పొందిన ప్రైమ్ వీడియో ఈ ప్రైమ్ ఒరిజినల్ తెలుగు సినిమా చీకటిలో ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీగా జనవరి 23 ను ప్రకటించింది. హైదరాబాద్ నేపథ్యములో చిత్రీకరించబడిన ఈ క్రైమ్ సస్పెన్స్ సినిమా, సంధ్య అనే ఒక ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ చుట్టూ తిరుగుతుంది. సంధ్య పాత్రను శోభిత ధూళిపాల పోషించారు. ఆమె నగరములో జరిగే కొన్ని దారుణమైన చీకటి రహస్యాలను వెలికితీస్తుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ ప్రై. లి. బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించగా ఈ చిత్రానికి చంద్ర పెమ్మరాజు రచనా సహకారం అందించారు. ఈ చిత్రములో ప్రధాన పాత్రలలో శోభిత ధూళిపాలతో పాటు విశ్వదేవ్ రాచకొండ కనిపించనున్నారు. వెంట చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఈ తెలుగు ఒరిజినల్ సినిమా ప్రైమ్ వీడియో భారతదేశములో అలాగే ప్రపంచవ్యాప్తంగా 240 పైగా దేశాలలో జనవరి 23న ప్రీమియర్ అవుతుంది.
ఎప్పుడు సందడిగా ఉండే హైదరాబాద్ నేపథ్యములో సాగే కథతో, చీకటిలో ఒక అద్భుతమైన తెలుగు ఒరిజినల్ క్రైమ్ సస్పెన్స్ సినిమాగా నిలుస్తుంది. ఇందులో సంధ్య అనే ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్, తన వద్ద శిక్షణ పొందుతున్న వ్యక్తి అనుమానాస్పద మృతికి న్యాయం చేయాలనే అలుపెరగని ప్రయత్నములో, దారుణమైన నేరాల గురించి కనిపెడుతుంది.
“ప్రైమ్ వీడియో వద్ద, మేము సాహసోపేతమైన, దక్షిణాది మూలాలు ఉన్న సృజనాత్మకందా ఉండే దక్షిణభారత ఒరిజినల్స్ ను విస్తరించాలనే ఆశయం కోసం పనిచేస్తున్నాము. సస్పెన్స్ థ్రిల్లర్లు చాలా జనాదరణ పొందుతుండగా, భావోద్వేగ అవగాహన ఉన్న కథనాలను అందించడముపై మేము దృష్టి సారిస్తున్నాము. మా తెలుగు ఒరిజినల్ సీరీస్ ధూత ప్రేక్షకులలో ఎక్కువగా ఆదరణ పొందింది. మా రాబోయే తెలుగు అమెజాన్ ఒరిజినల్ చీకటిలో ఈ కూడా అలాగే ఆదరణ పొందుతుంది”, అని నిఖిల్ మధోక్, డైరెక్టర్ & హెడ్ ఆఫ్ ఒరిజినల్స్, ప్రైమ్ వీడియో ఇండియా అన్నారు. “ఇతర చిత్రాల నుండి చీకటిలో సినిమాను భిన్నంగా ఉంటుంది. కథనములో కీలకపాత్ర పోషించే పాడ్కాస్ట్స్ వంటి ఆధునిక కథనాల మాధ్యమాల కలయిక ఈ చిత్రం. ఈ సినిమా యొక్క తట్టుకోగలిగిన సామర్థ్యము, సోదరిభావన అనే యూనివర్సల్ థీమ్స్ తెలుగు-మాట్లాడేవారిని ఆకర్షిస్తాయి. భారతదేశముతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అవుతాయి. ఈ ఒరిజినల్ సినిమాతో మేము సురేష్ ప్రొడక్షన్స్ తో మా దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి మెమెంతో సంతోషిస్తున్నాము. చీకటిలో ఒక గగుర్పొడిచే థ్రిల్లర్. జనవరి 23న ప్రైమ్ వీడియోపై ప్రీమియర్ గా ప్రసారం అవుతూ ప్రపంచములో ఉండే ప్రేక్షకులలో ప్రతిధ్వనిస్తుందని మేము విశ్వసిస్తున్నాము.”
చీకటిలో నిర్మాత డి. సురేష్ బాబు తన అభిప్రాయాలను పంచుకుంటూ… “చీకటిలో ఒక భావోద్వేగాలు నిండిన సస్పెన్స్ డ్రామా. చీకటిని ఎదుర్కోవడానికి, నిజాలు మాట్లాడటానికి కావలసిన ధైర్యాన్ని ఇది అన్వేషిస్తుంది. ఈనాటి సమాజములో ఇది మనకెంతో అవసరం. ఈ అమెజాన్ ఒరిజినల్ కోసం ప్రైమ్ వీడియోతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది. ఈ సినిమా దీర్ఘకాలంగా కొనసాగుతున్న మా భాగస్వామ్యములో మరొక మైలురాయి. కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, ప్రేక్షకులను కట్టిపడేసే ఇలాంటి పాత్రలతో ప్రత్యేకమైన మూలాలు కలిగిన కథనాలకు దోహదపడాలనే మా విజన్ ను పంచుకుంటాము. తన ఉత్కంఠభరితమైన కథ, శక్తివంతమైన నటనతో చీకటిలో ఒక మరపురాని ఉత్తేజకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. భారతదేశముతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు జనవరి 23న ప్రైమ్ వీడియో పై చీకటిలో ప్రీమియర్ గా ప్రసారం అవుతుంది. ప్రేక్షకులు ఈ క్రైమ్ థ్రిల్లర్ ను చూసి ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము.”






