Viral Songs: బజ్ ను పెంచుతున్న పాటలు
ఎప్పటిలానే ఈ ఇయర్ సంక్రాంతికి కూడా మంచి పోటీనే నెలకొంది. ఈ సారి సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ 5 సినిమాల్లో వేటికవే సపరేట్ క్రేజ్ ను కలిగి ఉండగా, రీసెంట్ గా ఇందులోని ఓ రెండు సినిమాలు వాటిలోని సాంగ్ తో హైప్ ను పెంచుకున్నాయి. అవే రాజా సాబ్(Raja Saab), మన శంకరవరప్రసాద్ గారు(Mana shankaravaraprasad Garu) సినిమాలు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) హీరోగా మారుతి(maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన హార్రర్ కామెడీ థ్రిల్లర్ ది రాజా సాబ్. ఈ సినిమాకు ఆల్రెడీ మంచి బజ్ నెలకొంది. జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ముగ్గురు హీరోయిన్లతో వచ్చిన నచ్చే నచ్చే(Nache Nache) సాంగ్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ తర్వాత రాజా సాబ్ కు ఉన్న హైప్ బాగా పెరిగింది.
ఇక చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు(MSG) నుంచి కూడా రీసెంట్ గా హుక్ స్టెప్(Hook Step) సాంగ్ రాగా, ఆ సాంగ్ లో చిరంజీవి వేసిన స్టెప్పులు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడీ హుక్ స్టెప్ సాంగ్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సాంగ్స్ లాగానే సినిమాలు కూడా ఆడియన్స్ ను అదే స్థాయిలో మెప్పిస్తాయేమో చూడాలి.






