BJP: దేశానికే శ్రీగురు తేజ్ బహదూర్ మార్గదర్శి : రామచందర్ రావు
మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో గురు తేజ్ బహదూర్ (Guru Tegh Bahadur) 350వ జయంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) మాట్లాడుతూ గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలన్నారు. దేశానికే శ్రీగురు తేజ్ బహదూర్ మార్గదర్శి, బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయదు. ఆయన చేసిన త్యాగన్ని గుర్తించి, జయంతి, వర్థంతులు నిర్వహిస్తున్నాం అని అన్నారు.






