CID: భూమన కరుణాకర్ రెడ్డి కి సీఐడీ నోటీసులు
తిరుమల పరకామణి (Parakamani) చోరి కేసులో వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) కి సీఐడీ (CID) అధికారులు నోటీసులు జారీ చేశారు. తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన పకరామణి ఉద్యోగి రవి (Ravi) పై 2023 ఏప్రిల్ 7న కేసు నమోదైంది. అప్పట్లో టీటీడీ ఏవీఎస్వోగా పనిచేసిన సతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహంలోని కార్యాలయంలో భూమన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.






