T20 World Cup: పాక్ సెమీస్ చేరుతుందా..? లెక్కలు ఇవే..!
టి20 వరల్డ్ కప్(T20 World Cup) లో ఆసియా జట్లకు కష్ట కాలం నడుస్తోంది. భారత్(Team India) సెమీస్ బెర్త్ కోసం తీవ్రంగా కష్టపడుతుంటే.. లీగ్ దశలో మంచి ప్రదర్శన చేసిన శ్రీలంక జట్టు ఫెయిల్ అయింది. ఇక పాకిస్తాన్ జట్టుకు ఆశలు సజీవంగానే ఉన్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకను ఓడించిన తర్వాత పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్(Semi Final) కు అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్.. శ్రీలంకను 61 పరుగుల భారీ తేడాతో ఓడించింది.
దీనితో న్యూజిలాండ్ కు నెట్ రన్ రేట్ గణనీయంగా పెరిగింది. నెట్ రన్ రేట్ ప్లస్ 3కు చేరుకోవడంతో న్యూజిలాండ్ దాదాపుగా సెమీస్ కు చేరుకునే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ తమ బెర్త్ ను ఖరారు చేసుకుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ కు ఇంకా అవకాశాలు కనపడుతున్నాయి. పాకిస్తాన్ టోర్నమెంట్ లో సజీవంగానే కనపడుతోంది. సెమీస్ కు చేరాలంటే.. సూపర్ 8 మ్యాచ్ లో శ్రీలంకను ఓడించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నెట్ రన్ రేట్ పాకిస్తాన్ కు -0.461 ఉంది.

ఇవి కూడా చదవండి
దీనితో పాక్ జట్టు తమ చివరి మ్యాచ్ లో శ్రీలంకను 70 పరుగుల తేడాతో ఓడించాలి. అయితే, పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. ఇంగ్లాండ్ కూడా న్యూజిలాండ్‌ను ఓడించాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ విజయం సాధిస్తే.. పాకిస్తాన్ అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కివీస్ తో ఇంగ్లాండ్ మ్యాచ్ వర్షం పడి రద్దు అయితే.. న్యూజిలాండ్ సెమీఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను 20 పరుగుల తేడాతో ఓడించినట్లయితే, పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే శ్రీలంకపై 50 పరుగుల తేడాతో గెలవాలి.
ఇవి కూడా చదవండి