ENG vs PAK: పాకిస్థాన్‌పై విక్టరీ.. సెమీస్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్!
పల్లెకెలె వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్ జట్టు (ENGvsPAK) అద్భుత విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా ఐదోసారి సెమీఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా ఇంగ్లండ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. టాప్ ఆర్డర్ కుప్పకూలినా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (100) వీరోచిత శతకంతో కదం తొక్కి ఇంగ్లండ్‌కు ఒంటిచేత్తో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేశాడు.
పాక్ మోస్తరు స్కోరు..
సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ కీలక (ENGvsPAK) మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (63) అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ, మరో ఎండ్‌లో అతనికి సరైన సహకారం లభించలేదు. సైమ్ ఆయూబ్ (7), కెప్టెన్ సల్మాన్ ఆఘా (5) దారుణంగా నిరాశపరిచారు. మిడిలార్డర్లో బాబర్ ఆజమ్ (25), ఫఖర్ జమాన్ (25), చివర్లో షాదాబ్ ఖాన్ (23) కాసేపు మెరుపులు మెరిపించడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ (ENGvsPAK) బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు ఒక వికెట్ దక్కింది.
ఇవి కూడా చదవండి
బ్రూక్ ఎదురుదాడి..
అనంతరం 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు (ENGvsPAK) ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0) ఇన్నింగ్స్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. జోస్ బట్లర్ (2), జాకబ్ బెథెల్ (8), టామ్ బాంటన్ (2) చేతులెత్తేయడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఒక పక్క వికెట్లు పడుతున్నా కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. శామ్ కర్రాన్ (16), విల్ జాక్స్ (28) అతనికి చక్కటి సహకారం అందించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విజయానికి కేవలం 10 పరుగుల దూరంలో బ్రూక్ అవుటవ్వడం, 19వ ఓవర్లో జాక్స్, ఓవర్టన్ (0) కూడా పెవిలియన్ చేరడంతో (ENGvsPAK) మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠ రేపింది. అయితే 20వ ఓవర్ తొలి బంతినే జోఫ్రా ఆర్చర్ (5 నాటౌట్) బౌండరీకి తరలించి ఇంగ్లండ్‌ను (19.1 ఓవర్లలో 166/8) విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో అఫ్రిదీ 4 వికెట్లు తీసినా లాభం లేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు:
పాకిస్తాన్: 164/9 (20 ఓవర్లలో) – (సాహిబ్జాదా ఫర్హాన్ 63, బాబర్ 25; డాసన్ 3/24, ఆర్చర్ 2/32)
ఇంగ్లండ్: 166/8 (19.1 ఓవర్లలో) – (హ్యారీ బ్రూక్ 100, జాక్స్ 28; షహీన్ అఫ్రిదీ 4/30, నవాజ్ 2/26)
ఇవి కూడా చదవండి
