మంచు కొండల మధ్య క్రికెట్ యుద్ధం..!
ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఈ రోజు ధర్మశాలలో జరగనున్న 55వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్, పాయింట్ల పట్టికలో టాప్-3లో నిలిచింది. కానీ, గత మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోవడంతో వారి ప్లేఆఫ్స్ బెర్తు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉన్న పంజాబ్‌కు, నేటి విజయం ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఈ సీజన్లో మొదటి నుంచీ అస్థిరంగానే ఉంది. అక్షర్ పటేల్(Axar Patel) నేతృత్వంలోని ఈ జట్టు 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 4 విజయాలతో 8వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీకి ఇది చావోరేవో లాంటి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టెక్నికల్‌గా ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది, లేదంటే ఈ సీజన్ నుండి అధికారికంగా నిష్క్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా నిస్సంకా వంటి యువ ఆటగాళ్లు మెరుపులు మెరిపిస్తున్నా, బౌలింగ్ విభాగం వైఫల్యం ఢిల్లీని వెంటాడుతోంది.
ఇవి కూడా చదవండి
ఈ 2026 సీజన్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ ఒక సెన్సేషన్. ఢిల్లీ నిర్దేశించిన 264 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ లు అద్భుతంగా రాణించారు. ఆ ఓటమి ఢిల్లీ ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీసింది. ఇప్పుడు అదే పంజాబ్‌ను వారి హోమ్ గ్రౌండ్ అయిన ధర్మశాలలో ఎదుర్కోవడం ఢిల్లీకి పెద్ద సవాలే.
చల్లని వాతావరణం, వేగవైన పిచ్‌పై ఇరు జట్ల ఫాస్ట్ బౌలర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో టాప్-4 కోసం గట్టి పోటీ నెలకొన్న తరుణంలో, నేటి మ్యాచ్ ఫలితం ఇతర జట్ల అవకాశాలను కూడా ప్రభావితం చేయనుంది. పంజాబ్ గెలిస్తే వారి ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయమవుతుంది, అదే ఢిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టిక మధ్యలో ఉన్న జట్ల మధ్య పోటీ మరింత తీవ్రమవుతుంది. ధర్మశాల (Dharmashala) పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టి, మరోసారి భారీ స్కోర్ల మ్యాచ్ చూసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
