My Home Udyan: మై హోమ్ గ్రూప్ అందిస్తున్న సరికొత్త నివాస ప్రాజెక్ట్ ‘మై హోమ్ ఉద్యన్’
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ‘మై హోమ్’ గ్రూప్ తనదైన ముద్రను వేస్తూ దూసుకుపోతోంది. గత 35 ఏళ్లుగా నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తూ, హైదరాబాద్‌లో అత్యుత్తమ నివాసాలను అందించే సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మై హోమ్ గ్రూప్ కేవలం భవనాలను నిర్మించడమే కాకుండా, ఒక భారీ వారసత్వాన్ని నిర్మించింది. ఇప్పటివరకు 25కుపైగా నివాస మరియు వాణిజ్య ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. సంస్థ కేవలం లాభాలకే పరిమితం కాకుండా కొన్ని లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. ఉన్నత జీవన ప్రమాణాలు, పారదర్శకమైన డాక్యుమెంటేషన్, సమయపాలన, వ్యూహాత్మక ప్రాంతాలు మరియు కట్టుదిట్టమైన భద్రత, సౌకర్యవంతమైన జీవనం – ఇవే మై హోమ్ గ్రూప్‌ను కొనుగోలుదారుల మొదటి ఎంపికగా నిలబెట్టాయి. విలువైన పెట్టుబడికి, సురక్షితమైన నివాసానికి ‘మై హోమ’ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇప్పటివరకు సంస్థ సుమారు 3.7 కోట్ల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టింది. ప్రస్తుతం 4.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ప్రాజెక్టులను చేపట్టి నిర్మించనున్నది. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా మరో 5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టుల రూపకల్పన చేయనున్నది.
ఉద్యన్
హైదరాబాద్‌లోని తెల్లాపూర్‌లో మై హోమ్ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సరికొత్త నివాస ప్రాజెక్ట్ మై హోమ్ ఉద్యన్. సుమారు 24.12 ఎకరాల విస్తీర్ణంలో, 8 టవర్లు మరియు జిప్లస్ 48 అంతస్తులతో ఈ భారీ గేటెడ్ కమ్యూనిటీ రూపొందుతోంది. ఇందులో 2, 2.5, 3, 4 బెడ్ రూమ్‌ల ప్రీమియం అపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లోని వెస్ట్ జోన్లో, ముఖ్యంగా తెల్లాపూర్ – కొల్లూర్ పరిసరాల్లో, ఓఆరఆర్ ఎగ్జిట్ 2కి దగ్గరగా ఉంది. ప్రాజెక్ట్‌లో 83% ఖాళీ ప్రదేశం మరియు పచ్చదనానికి కేటాయించారు.
ముఖ్యాంశాలు
* 24.12 ఎకరాలు, 8 టవర్లు, ఒక్కో టవర్ 48 అంతస్తులు,
* 2, 2.5, 3, 4 బెడ్ రూమ్‌లు, 3,766 ప్రీమియం అపార్ట్మెంట్లు.
* ఉద్యానవనాలు…పూలతోటలు ఇందులో ప్రత్యేకం…
* వెల్నెస్ గార్డెన్, ఫ్లవర్ గార్డెన్, పోడియం గార్డెన్, లీజర్ గార్డెన్
* శిల్ప గార్డెన్, చిన్నారుల గార్డెన్, హెల్త్ గార్డెన్ ఇలా…
* లక్ష స్క్వేర్ ఫీట్లలో జిప్లస్ 5 క్లబ్ హౌజ్ నిర్మాణం గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ, జిమ్, మల్టిపర్పస్ హాల్,
* యోగ, ఏరోబిక్ హాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్
మూడు దశాబ్దాలుగా..
మూడు దశాబ్దాలుగా, మై హోమ్ కన్స్ట్రక్షన్ ఆలోచనాత్మకమైన డిజైన్, అత్యున్నత ఇంజనీరింగ్, శాశ్వత విలువలతో కూడిన ఇళ్లను నిర్మిస్తూ, కస్టమర్ల కలను నిజం చేస్తోంది. మేము కేవలం కట్టడాలను మాత్రమే నిర్మించలేదు; సమయానికి అందించడం, కస్టమర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ మరియు తిరుగులేని నాణ్యతతో నమ్మకాన్ని నిర్మించాము. మూడు దశాబ్దాలుగా, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉంటూ, మా కస్టమర్ల అంచనాలను నిరంతరం అందుకుంటూ, వాటిని మించి రాణిస్తోంది. నాణ్యత, విశ్వసనీయత మరియు చిత్తశుది, ఇవే మేము నిర్మించే ప్రతి కట్టడం వెనుక ఉన్న మార్గదర్శక సూత్రాలు. ఈ విలువల వల్లనే హైదరాబాద్‌లోని 24కు పైగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా వేలాది కుటుంబాల నమ్మకాన్ని మేము పొందగలిగాము. మా కస్టమర్ల నిరంతర ఆదరణే మాకు గొప్ప ప్రేరణ, ఇది ప్రతి ప్రాజెక్టుతో కొత్త ప్రమాణాలను నెలకొల్పేలా మమ్మల్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు ఉదాన్ పేరుతో నిర్మిస్తున్న హైరైజ్ బిల్డింగ్ కూడా కస్టమర్లను సంతప్తి పరిచేలా ఉంటుంది. ఇందులో విభిన్నమైన తోటలు మీకు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. డిజైన్ నుంచి వసతుల దాకా అన్నీ మీకు నచ్చేలా ఉంటుంది. ఈ హైరైజ్ బిల్డింగ్స్ మా ప్రాజెక్టుల్లో ప్రత్యేకంగా ఉండనున్నది.
డాక్టర్ రామేశ్వర రావు జూపల్లి
చైర్మన్, మై హోమ్ గ్రూప్.
