ASBL: శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన ఏఎస్బిఎల్
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సునీత గానం
మార్చి హైదరాబాద్ : భక్తి, వేడుకలు, సంగీతం, సంస్కృతి, ఐక్యతతో నిండిన ఒక మహోన్నత కార్యక్రమాన్ని ఏఎస్బిఎల్ నిర్వహించింది. శ్రీరామ నవమి పురస్కరించుకుని ఏఎస్బిఎల్ ఆర్టిసి ఎక్స్ రోడ్స్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు.
ఏఎస్బిఎల్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అజితేష్ కొరుపోలు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో కళ్యాణం యొక్క పవిత్రత నుండి దాని తర్వాత జరిగిన ప్రదర్శనల సౌందర్యం వరకు, ఈ సాయంకాలం ప్రతి అంశం వేడుకలను సజీవంగా, హృద్యంగా, చిరస్మరణీయంగా మార్చాయి.
ఈ సాయంకాలం అతిపెద్ద ఆకర్షణలలో ఒకటిగా కోటికి పైగా రామ నామాలను వ్రాసే రికార్డు ప్రయత్నం నిలిచింది. ఇది శ్రీరామునిపై ప్రజలకు ఉన్న ప్రేమ, విశ్వాసాన్ని ప్రతిబింబించింది.
ఇవి కూడా చదవండి

ఈ వేడుకలలో భాగంగా నృత్య ప్రియ కూచిపూడి ప్రదర్శన కూడా జరిగింది, ఇది వేడుకకు చక్కదనాన్ని, శాస్త్రీయ సౌందర్యాన్ని అందించింది. రామచారి గారి విద్యార్థుల ప్రదర్శనలు ఈ సాయంకాలానికి మరింత ఆకర్షణను, సాంస్కృతిక వైభవాన్ని జోడించాయి. భజనలు, రామాయణ నాటిక, గాయని సునీత హృద్యమైన గీతాలాపనలు సాయంకాలపు ఉత్సాహాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లాయి.
ఏఎస్బిఎల్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ రామనవమి వేడుకలను జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయనే మాట్లాడుతూ సంప్రదాయ వేడుకలను ఇలా సమిష్టిగా జరుపుకోవటం ద్వారా కమ్యూనిటీ భావన నివాసితులలో కలుగుతుంది ఈ తరహా వేడుకలను తమ ప్రాంగణాలలో మరింత వేడుకగా జరపటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు.
ఈ వేడుకలకు హాజరైన ప్రముఖులలో సుమ కనకాల, ఐశ్వర్య రాజేష్, లాస్య మంజునాథ్, గాలి మహేశ్వరి, నీలి మేఘాలలో, శివ జ్యోతి, హిమజ మల్లారెడ్డి, విష్ణుప్రియ, పూజా వేగేశ్న, నిఖిల్ విజయేంద్రసింహ, అలేఖ్య హారిక ఉన్నారు.
ఇవి కూడా చదవండి