The Trilight: ఐకానిక్ ల్యాండ్ మార్క్ ది ట్రైలైట్
హైదరాబాద్‌లోని నియోపోలిస్, కోకాపేట్ వద్ద నిర్మితమవుతున్న ‘ది ట్రైలైట్’ నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విలాసవంతమైన జీవనానికి మరియు అత్యాధునిక నిర్మాణ శైలికి మారుపేరుగా నిలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధానంగా పి. మంగళత్రామ్ డెవలపర్స్, డి బ్లూఓక్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ నాణ్యతను పర్యవేక్షించే బాధ్యతను ప్రసిద్ధ టాటా ప్రాజెక్ట్స్ కు అప్పగించారు. పి. మంగళత్రామ్ గ్రూప్ 15-20 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో విశేషమైన పేరును సంపాదించుకున్న సంస్థగా పేరు పొందింది. గ్రోత్ నెవర్ స్టాప్స్ అనే నినాదంతో వీరు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు.
సువర్ణ దుర్గ గ్రూప్ / డి బ్లూఓక్ గ్రూపునకు పేపర్ మిల్లులు, బాటిల్ రీసైక్లింగ్ మరియు కన్స్ట్రక్షన్ రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. ఈ ప్రాజెక్టుకు ఆర్కిటెక్ట్స్‌గా టీమ్ వన్ ఇండియా వ్యవహరిస్తోంది. ఇంటీరియర్ డిజైన్ ను ప్రముఖ డిజైనర్లు ఆమిర్ మరియు హమీద చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నియోపోలిస్ లేఅవుట్లోని అత్యంత ఖరీదైన ప్లాట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టులో విశాలమైన ఇళ్లు: ఇక్కడ 3, 4, మరియు 5 BHK అల్ట్రా-లగ్జరీ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 2,888 చ.అ. నుండి 11,333 చ.అ. వరకు ఉంది.
తమ ప్రాజెక్టుల ద్వారా నివాసాలను నిర్మించడం కాకుండా, ఒక సరికొత్త జీవనశైలిని పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అపార్ట్మెంట్లలో విల్లా అనుభూతిని అందించడం అనేది మా ప్రధాన ఆశయం. అలాగే తమ ప్రాజెక్టుల కోసం టాటా ప్రాజెక్ట్స్ వంటి దిగ్గజ సంస్థలతో జతకట్టడం ద్వారా, నిర్మాణ నాణ్యత మరియు సకాలంలో డెలివరీ విషయంలో మా నిబద్ధతను తెలియజేస్తున్నాము. మంగళత్రామ్ గ్రూప్‌కు ఉన్న 100 ఏళ్ల వ్యాపార వారసత్వం, సువర్ణ దుర్గ గ్రూప్ యొక్క పారిశ్రామిక అనుభవాన్ని కలిపి, కస్టమర్లలో బలమైన నమ్మకాన్ని కలిగిస్తూ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాము. హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన నియోపోలిస్‌లో ప్లాట్ నం. 9ని రికార్డు ధర వెచ్చించి కొనుగోలు చేయడం ద్వారా, మేము మార్కెట్ లీడర్లుగా ఉండాలనుకుంటున్నట్లు గతంలోనే నిరూపించాము. ఉన్నత వర్గాల అవసరాలకు తగ్గట్టుగా అత్యున్నత స్థాయి ప్రైవసీ మరియు లగ్జరీని మీరు ఈ ప్రాజెక్టులో చూడవచ్చు. పచ్చదనం మరియు పర్యావరణ హితమైన డిజైన్లకు ప్రాముఖ్యత ఇస్తూ, భవిష్యత్తు తరాలకు సరిపోయేలా ఆధునిక సాంకేతికతను ఇందులో వాడుతున్నాము. చివరగా మా మాట ఏమిటంటే…. మేము కేవలం కాంక్రీట్ కట్టడాలను నిర్మించడం లేదు; హైదరాబాద్ సిటీ స్కైలైన్‌ను మార్చే ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లను సృష్టిస్తున్నాము. ప్రతి ఇటుకలోనూ మా పారదర్శకత మరియు శ్రేష్ఠత కనిపిస్తాయి.
ముఖ్యాంశాలు
* 49 నుండి 56 అంతస్తుల ఎత్తుతో కూడిన 3 ఐకానిక్ టవర్లు.
* సుమారు 200 మీటర్ల ఎత్తుతో, నగరం యొక్క ఆకాశహర్మ్యాలలో ఒకటిగా
* 4.23 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 462 అపార్ట్మెంట్లు మాత్రమే
* 3, 4, మరియు 5 బెడ్ రూం అపార్ట్మెంట్లు.
* విల్లా అనుభూతిని ఇచ్చేలా 23 అడుగుల ఎత్తు ఉన్న లివింగ్ రూమ్‌లు.
* 3 వైపులా ఓపెన్ వ్యూ
* స్కై క్లబ్ అండ్ ఇన్ఫినిటీ పూల్
* 47వ అంతస్తులో టవర్లను కలిపే స్కై బ్రిడ్జ్, ఇన్ఫినిటీ పూల్ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణ.
* బహుళ స్థాయి క్లబ్ హౌస్: సుమారు 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 3 విభిన్న స్థాయిలలో క్లబ్ హౌస్ సౌకర్యాలు
* ఇక్కడి నుండి గండిపేట సరస్సు అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి.
కనెక్టివిటీ: ఔటర్ రింగ్ రోడ్‌కు కేవలం 1 నిమిషం దూరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలి ప్రాంతాలకు కేవలం 5-10 నిమిషాల్లో చేరుకోవచ్చు.
