Aparna Synergy: భాగ్యనగరి సిగలో మరో ఆణి ముత్యం అపర్ణ సినర్జి
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటి కావటంతో పాటు భాగ్యనగరంలో వివిధ ప్రాజెక్టులతో అపర్ణ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ అందరినీ ఆకట్టుకుంటోంది. 1996 నుండి నేటి వరకు ఇటుక ఇటుకతో వేలాదిమంది సొంతింటి కలలను నిజం చేస్తోంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మేము, సరసమైన ధర, విలాసం, సుస్థిరత మధ్య సరైన సమతుల్యతను కలిగిన ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీ తన నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలు, పర్యావరణ అనుకూల రూపకల్పన, ఐఎస్ ఓ ధృవీకరణలతో, కలలకు రూపమిచ్చే నివాసాలను నిర్మిస్తూనే ఉంది. లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాలతో హైదరాబాద్, బెంగుళూరులోని వేలాదిమందికి ఇంటి వసతిని అపర్ణ కంపెనీ అందించింది.
హైదరాబాద్‌లోని గండి మైసమ్మ వద్ద నిర్మించనున్న హై ఎండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ సముదాయం అపర్ణ సినర్జీ. ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు 27.5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఉన్నతమైన జీవనశైలిని కోరుకునే వారికి, ముఖ్యంగా సమీపంలోని ఫార్మా మరియు ఐటి సంస్థలలో పనిచేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాల నడుమ అపర్ణ సినర్జీ ప్రాజెక్టు ఉంది. సహజ పరిసరాల అందం మరియు ఆధునిక అనుసంధానిత ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. గేటెడ్ కమ్యూనిటీ నివాసంగా మరియు పెట్టుబడిగా అపారమైన విలువను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున గండి మైసమ్మ వద్ద ఉన్న అపర్ణ సినర్జీ, దుండిగల్ నుండి ఓఆరఆర్ ఎగ్జిట్ 5 ద్వారా 2 నిమిషాల కంటే తక్కువ దూరంలో, మేడ్చల్ నుండి ఓఆరఆర్ ఎగ్జిట్ 6 ద్వారా 20 నిమిషాల దూరంలో, మియాపూర్ నుండి 30 నిమిషాల దూరంలో మరియు హైటెక్ సిటీ నుండి 40 నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు
* మొత్తం విస్తీర్ణం: సుమారు 28 ఎకరాలు.
* భవనాల నిర్మాణం: 15 టవర్లు, ఒక్కో టవర్ 27 అంతస్తులు (జిప్లస27) ఉంటుంది.
* మొత్తం ఫ్లాట్లు: 3,345 యూనిట్లు.
* ఫ్లాట్ రకాలు: 2 బెడ్రూములు, 2.5 బిహెచ్కె మరియు 3 బిహెచ్కె అపార్ట్మెంట్లు.
* క్లబ్‌హౌస్: 63,949 చ.అడుగుల విస్తీర్ణంలో భారీ క్లబ్‌హౌస్.
* స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్‌బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్ మరియు ఇండోర్ గేమ్స్.
* జిమ్, యోగా మరియు మెడిటేషన్ హాల్. ప్లే ఏరియా, స్కేటింగ్ రింక్.
ప్రపంచంలోని అత్యున్నత శ్రేణి సౌకర్యాలను అందిస్తూ, మరోవైపు ప్రతి అపార్టుమెంట్ అద్భుతమైన సహజ కాంతి, గాలి ప్రవహించేలా రూపొందించబడ్డాయి. 100శాతం వాస్తుకు అనుగుణమైన ఈ నిర్మాణాలు రాజీలేని జీవన అనుభవాన్ని అందిస్తుంది. గత సంవత్సరం తమ కంపెనీకి ఎన్నో అవార్డులు లభించాయి. కన్స్ట్రక్షన్ వరల్డ్ డిజైన్ అవార్డు, ఐఎస్డిఎ ఇన్ఫ్రాకన్ అవార్డు ఇలా ఎన్నో అవార్డులతోపాటు కస్టమర్ల అభినందనలు, ప్రశంసలు మా కంపెనీపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. మీకు నచ్చేలా అపర్ణ సినరీÊ కూడా ఉంటుంది. ఎస్.ఎస్. రెడ్డి, చైర్మన్, ఎండి.
