The Pearl: ఆరో రియాల్టీ వారి విలాసవంతమైన ప్రాజెక్ట్ ది పెర్ల్
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ సంస్థగా ఆరో రియల్టీ గుర్తింపు పొందింది. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత మరియు వినూత్న పద్ధతులతో విలాసవంతమైన నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తూ ఈ సంస్థ పరిశ్రమలో అగ్రగామిగా ఎదుగుతోంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా, అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించుకుంది. ఆరో రియల్టీ ప్రాజెక్టులకు ప్రస్తుతం మార్కెట్లో విశేష స్పందన లభిస్తోంది.
నగరంలోని కీలక ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ ప్రాజెక్టులకు మంచి ఆదరణ కనిపిస్తోంది. గృహ నిర్మాణాలే కాకుండా, కమర్షియల్ విభాగంలోనూ ఈ సంస్థ తన సత్తాను చాటుకుంది. బహుళజాతి సంస్థలకోసం ఆఫీస్ స్పేస్ లను నిర్మించి ఇస్తోంది.
హైదరాబాద్ స్కైలైన్‌ను విలాసవంతమైన శిఖరాలకు చేర్చే అద్భుతమైన సృష్టి, ఆరో రియల్టీ వారి ‘ది పెర్ల’. ప్రపంచ స్థాయి వైభవాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, ఇక్కడ రూపుదిద్దుకున్న 414 స్కై మాన్షన్స్ అద్భుతమైన జీవనశైలిని, విశాలమైన వాతావరణాన్ని మరియు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వసతులను అందిస్తున్నాయి. అద్భుతమైన దృశ్యాలు: ప్రత్యేకమైన ప్రైవేట్ మరియు ల్యాండ్‌స్కేప్ బాల్కనీల ద్వారా నగర అందాలను వీక్షిస్తూ ఆహ్లాదకరంగా గడపవచ్చు. అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన ఈ నిర్మాణ అద్భుతాన్ని లండన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ మెసెసె చాప్మన్ టేలర్ రూపొందించారు. వినూత్నమైన డిజైన్లు మరియు ఉబెర్-లగ్జరీ సౌకర్యాలతో ఇది ఒక మాయా ప్రపంచాన్ని తలపిస్తుంది.
గచ్చిబౌలి మరియు మాదాపూర్ వంటి ఐటి హబ్‌లకు నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది.
ప్రాజెక్ట్ ముఖ్య విశేషాలు
* 8.54 ఎకరాలు… 7 టవర్లు… జిప్లస్ 33 అంతస్తులు,
* ఒక్క ఫ్లోర్‌కు ఒకే ఫ్లాట్ (4 బెడ్రూమ్)
* 5,300 నుండి 5,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
* 3 అంతస్తులతో కూడిన అల్ట్రా-లగ్జరీ క్లబ్‌హౌస్
* విశాలమైన ల్యాండ్‌స్కేప్ బాల్కనీ
* సెంట్రల్ కోర్ట్ యార్డ్
* ఇన్ఫినిటీ పూల్, బౌలింగ్ అల్లే, స్పొర్ట్స్ బార్, వర్చువల్ రియాలిటీ థియేటర్, మినీ సినీప్లెక్స్.
* ఇండోర్ జిమ్, యోగా పెవిలియన్, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్‌బాల్ కోర్ట్ మరియు జాగింగ్ ట్రాక్
విలాసవంతమైన జీవనశైలికి అవసరమైన అన్ని రకాల ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మాణం, రాజీ లేని నాణ్యతతో కూడిన అద్భుతమైన ఫీచర్లు, నేటి తరం మెచ్చేలా డిజైన్లు, ఇతర ఏర్పాట్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. మీకు నచ్చిన జీవనశైలి మరియు ఏకాంతం ఈ ప్రాజెక్టులో మెండుగా లభిస్తాయి, దీనివల్ల ఇక్కడ ప్రతి రోజూ ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. అద్భుతమైన వసతులలో మునిగితేలుతూ, మీ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. మా క్లయింట్లకు అత్యుత్తమమైన మరియు ఎటువంటి ఇబ్బందులు లేని ప్రాజెక్టులను అందించడమే మా లక్ష్యం.
రవీంద్రకుమార్ విజె, సిఇఓ
