Navanaami Megaleio: జీవనశైలికి కొత్త నిర్వచనం.. నవనామి మెగాలియో
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మరో ప్రతిష్టాత్మక సంస్థ నవనామి. తన ప్రాజెక్టులు కేవలం చిరునామాలుగా మాత్రమే కాకుండా, ప్రతిష్ఠాత్మక చిహ్నాలుగా నిలిచిపోయే ఆధునిక మరియు ఆకర్షణీయమైన నివాస స్థలాలుగా ఉండాలన్న లక్ష్యంతో నవనామి పనిచేస్తోంది. హైదరాబాద్‌లోని అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటిగా ఉన్న నవనామి, డిజైన్, నిర్మాణ రంగంలో ఒక సమగ్రమైన విధానంతో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త రూపునిస్తోంది. అద్భుతమైన నిర్మాణ శైలి మరియు ఆలోచనాత్మకమైన రూపకల్పనపై మాకు ఉన్న ప్రేమ నవనామి యొక్క మూలతత్వంలోనే ఉంది. అంచనాలకు మించి ఉండే అద్భుతమైన నివాస స్థలాలను సృష్టించడానికి మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు మరియు డిజైనర్లతో కలిసి పనిచేస్తూ సరికొత్తగా ప్రాజెక్టులను కస్టమర్లకు అందిస్తున్నాము. నవనామికి చెందిన ప్రతి ఆస్తి కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు; నివాస స్థలాలను కాలాతీతమైన కళాఖండాలుగా మార్చాలనే మా తపనకు అది ఒక నిదర్శనమని కంపెనీ పేర్కొంటోంది.
మెగాలియో
హైదరాబాద్‌లోని కిస్మత్పూర్ ప్రాంతంలో నవనామి మెగాలియో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఒక అత్యంత విలాసవంతమైన మరియు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా దీనిని నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఒక అపార్ట్మెంట్ మాత్రమే కాదు, ప్రకృతి ఒడిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఒక అల్ట్రా-లగ్జరీ జీవనశైలికి సంబంధించిన ప్రాజెక్టుగా కనిపిస్తుంది. సుమారు 5 ఎకరాల పైగా విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఇది ఒక భారీ హై-రైజ్ కట్టడం. అందరికీ నచ్చేలా డిజైన్లతో దీనిని రూపొందిస్తున్నారు. నవనామి మెగాలియో దాని ప్రత్యేకమైన ‘్పుuతీఙఱశ్రీఱఅవaతీ’ (వంపులు తిరిగిన) డిజైన్‌కు పేరుగాంచింది, ఇది భవనానికి ఒక అద్భుతమైన రూపాన్ని ఇస్తుంది.
ముఖ్యాంశాలు…
* 4.1 ఎకరాల్లో నిర్మాణం…2 టవర్లు, 150 అపార్టుమెంట్లు.. 50 అంతస్థులు
* అల్ట్రా-లగ్జరీ ఫ్లాట్లు… ఒక్కో ఫ్లాట్ సుమారు 5,000 చదరపు అడుగులపైగా…
* ప్రపంచ స్థాయి వసతులు
* 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక క్లబ్‌హౌస్.
* టవర్లను కలిపే స్కై బ్రిడ్జ్ ప్రత్యేక ఆకర్షణ.
* ఇన్ఫినిటీ పూల్, జిమ్, యోగా స్టూడియో, మినీ థియేటర్, మరియు ఇండోర్ గేమ్స్.
* కనెక్టివిటీ: గచ్చిబౌలి మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు కేవలం 10-15 నిమిషాల్లో చేరుకోవచ్చు.
* హిమాయత్ సాగర్ మరియు గండిపేట్ చెరువులకు సమీపంలో ఉండటం మరో ముఖ్యమైన అంశం.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో డిజైన్ మరియు ఇన్నోవేషన్‌కు సరికొత్త చిరునామాగా మెగాలియో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక నివాస స్థలాన్ని మాత్రమే కాకుండా, పరిమితులు లేని ఒక అద్భుతమైన జీవనశైలిని మీకు అందిస్తున్నాము. ప్రపంచంలోని అత్యుత్తమ నివాసాలకు దీటుగా ఇది ఉంటుంది. ఉన్నతమైన జీవన అనుభవాన్ని ఈ ప్రాజెక్టు మీకు అందిస్తుందని మేము హామీ ఇస్తున్నాము. మా ప్రతి ప్రాజెక్టు కస్టమర్ల అవసరాలకు, కోరికలకు అనుగుణంగా ఉంటాయి.
నవీన్ గద్దె
సిఇఓ, నవనవామి
