ప్రధాని మోదీ పిలుపును స్వాగతిస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి
తమతో కలిసి రావాలన్న ప్రధాని మోదీ (Modi) పిలుపును స్వాగతిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ప్రధాని అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆయన పిలుపులో రాజకీయాలకు తావులేదని చెప్పారు. అభివృద్ధి (Development), సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని తెలిపారు. తమ పార్టీలు, ఐడియాలజీ వేరైనా, అభివృద్ధి, కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఎన్నోసార్లు కలిసినా కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని, 2 గంటలు సమయమిస్తే తమ ప్రణాళికలు ప్రధాని (Prime Minister)కి వివరిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
