Pawan Kalyan: వరద బాధితులకు అండగా నిలవండి : పవన్ కల్యాణ్

హైదరాబాద్ వరద బాధితుల (Flood victims)కు అండగా నిలవాలని అభిమానులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచించారు. జనసేన (Janasena) తెలంగాణ నాయకులు, శ్రేణులకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. వరద బాధితులకు దైర్యం చెప్పి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. మూసీ వరద కారణంగా ఎంజీబీఎస్‌తో పాటు పరిసరాలు నీటమునిగాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రభుత్వ సూచనలు, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచించారు.