Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టు లో చంద్రబాబుకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ చంద్రబాబును సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం (Shanmugaratnam), అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma), ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా (Ajay Banga) కలిశారు. వివిధ అంశాలపై చంద్రబాబు వారితో చర్చించారు. దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు వెళ్లనున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});





