Naini: నైనీ టెండర్లపై సీబీఐ విచారణకు ఆదేశించాలి :హరీశ్ రావు
నైనీ (Naini) బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు ఆదేశించాలని బీఆరఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలను పక్కన పెట్టి వాటాల కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఔట్ సోర్సింగ్ సీఎం (CM)కు, అసలైన కాంగ్రెస్ వాదులకు మధ్య వార్ నడుస్తోందని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






