ED: వైసీసీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED)నోటీసులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 23న విచారణకు రావాలని పేర్కొంది.లిక్కర్ స్కామ్లో ఆయన కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో హవాలా, మనీ ల్యాండరింగ్ రూపంలో భారీఎత్తున అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆయనకు సూచించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});





