YUNUS GOVERNMENT: మైనార్టీల ఊచకోత.. లైట్ తీసుకుంటున్న బంగ్లా సర్కార్….
ఓవైపు బంగ్లాదేశ్ లో మైనార్టీలను మతదురహంకారులు ఊచకోత కోస్తున్నారు. పాతపగల్ని గుర్తించుకుని మరి దాడులు చేసి అంతమొందిస్తున్నారు.. ఆస్తులు దోచుకుంటున్నారు. ప్రాణ,మానాలను హరిస్తున్నారు. ఈ దాడులను ప్రపంచమంతా గర్హిస్తోంది. సరైన చర్యలు తీసుకుని.. మైనార్టీల హక్కులను, ప్రాణాలను కాపాడాలని బంగ్లాదేశ్ సర్కార్ ను కోరుతోంది. అయితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ మాత్రం చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఇది అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
లేటెస్టుగా యూనస్ సర్కార్ ఓ ప్రకటన చేసింది. అందులో..గత ఏడాది తమ దేశంలో మైనారిటీలకు సంబంధించిన ఘటనల్లో చాలా వరకు నేరపూరిత స్వభావం కలిగినవారు చేసినవే అని పేర్కొంది. మతపరమైన ఉద్దేశాలు కారణం కాదని తెలిపింది. కొంతకాలంగా బంగ్లాదేశ్లో మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలంటూ భారత్ ఒత్తిడి తీసుకొచ్చిన వేళ ఈ ప్రకటన వెలువడింది.
మైనారిటీలకు సంబంధించి గతేడాది 645 ఘటనలు చోటుచేసుకున్నట్లు బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ కార్యాలయం వెల్లడించింది. వాటిలో 71 ఘటనల్లో మతపరమైన కోణాలు ఉన్నట్లు పేర్కొంది. ఆలయాలపై దాడులకు సంబంధించి 38 ఘటనలు నమోదైనట్లు చెప్పింది. 71లో 50 ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారని, అంతే సంఖ్యలో నిందితులను అరెస్టు చేశారని వెల్లడించింది. మరో 21 ఘటనల్లో తగు చర్యలు తీసుకున్నారని తెలిపింది. అన్ని నేరాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బంగ్లాదేశ్ పేర్కొంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బంగ్లాదేశ్ గణాంకాలను బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ (బీహెచ్బీసీయూసీ) ఖండించింది. ఇలాంటి ప్రకటనలు నేరస్థులను ప్రోత్సహించి, వారికి శిక్ష పడదనే భావనను కలిగిస్తాయని హెచ్చరించింది. బంగ్లాదేశ్లో మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో మూడు వారాల వ్యవధిలోనే 10 మందికిపైగా హిందువులు హత్యకు గురయ్యారు. దీంతో అక్కడ హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.






