Karthi: కార్తీ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడా?
కార్తీ(karthi) హీరోగా వచ్చిన ఖైదీ(khaidhi) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే ఖైదీ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) కు మంచి పేరు, క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా కూడా ఇదే. లోకేష్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ఆడియన్స్ అందరినీ విపరీతంగా మెప్పించింది.
అయితే ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అప్పుడే చెప్పిన సంగతి తెలిసిందే. ఖైదీ సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా మేకర్స్ ఇంకా ఆ సీక్వెల్ ఎప్పుడొస్తుందనేది క్లారిటీగా చెప్పడం లేదు. మరోవైపు కార్తీ కూడా ఈ ప్రాజెక్టు కోసం ఎంతో వెయిట్ చేస్తున్నట్టు పలు మార్లు చెప్పాడు. ఇదిలా ఉంటే ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు తగ్గిపోయినట్టు కోలీవుడ్ మీడియా వర్గాలంటున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కూలీ(coolie) మూవీ తర్వాత లోకేష్ వేరే కథలపై ఫోకస్ పెట్టాడని, రీసెంట్ గా అల్లు అర్జున్(Allu arjun) తో ప్రాజెక్టు ను కూడా అనౌన్స్ చేశాక ఆ సినిమాతోనే బిజీ అవనున్నాడని, దీంతో ఖైదీ సీక్వెల్ ఇప్పట్లో జరిగేలా లేదని కార్తీ ఈ సీక్వెల్ నుంచి తప్పుకుని తన తర్వాతి సినిమాలపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాలంటే కార్తీ, లోకేష్ లో ఎవరొకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.






