Pushpa3: పుష్ప3 పై లేటెస్ట్ అప్డేట్
పుష్ప ది రైజ్(pushpa the rise), పుష్ప ది రూల్(Pushpa the rule) సినిమాలతో అల్లు అర్జున్(Allu arjun) కు వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా తర్వాతే స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. సుకుమార్(sukumar) దర్శకత్వంలో రష్మిక మందన్నా(rashmika mandanna) హీరోయిన్ గా తెరకెక్కిన ఈ ఫ్రాంచైజ్ సినిమాలు ఎన్నో రికార్డులను అందుకున్నాయి.
పుష్ప1 సినిమా బన్నీకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డును తీసుకొస్తే, పుష్ప2 అతని మార్కెట్, క్రేజ్ ను మరింత పెంచాయి. దీంతో అందరికీ పుష్ప3 పై అంచనాలు భారీగా పెరిగాయి. ఎప్పుడెప్పుడు పుష్ప3(pushpa3) సినిమా వస్తుందా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటూ సాధారణ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుష్ప3 కు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తాజా సమాచారం ప్రకారం పుష్ప3 ది ర్యాంపేజ్ వర్క్స్ నెమ్మదిగా మొదలవుతున్నాయని, దీని కోసం హైదరాబాద్ లో ఓ ఆఫీస్ ను తీసుకుని మరీ స్క్రిప్ట్ వర్క్, స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. పుష్ప3లో తిరిగి ఎర్ర చందనం సామ్రాజ్యాన్ని పుష్ప ఎలా సొంతం చేసుకున్నాడనే దానిపై ఉండనుందని సమాచారం. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, వారి కమిట్మెంట్స్ పూర్తయ్యాక పుష్ప3 మొదలవనుందని తెలుస్తోంది.






