Lenin:లెనిన్ మూవీ పై లేటెస్ట్ అప్డేట్
ఎంత కష్టపడినా అక్కినేని యంగ్ హీరో అఖిల్(akhil) కు సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలానే తయారవుతుంది. ఏజెంట్ (agent) తో డిజాస్టర్ ను మూట గట్టుకున్న అఖిల్ ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు. మురళీ కిషోర్ అబ్బూరి(murali kishore abburi) దర్శకత్వంలో అఖల్ ప్రస్తుతం సినిమా చేస్తుండగా, ఆ మూవీకి లెనిన్(lenin) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైనప్పటికీ మళ్లీ ప్యాచ్ వర్క్ షూట్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్యాచ్ వర్క్ షూట్ కు బ్రేక్ ఇవ్వగా, మళ్లీ ఈ వారం నుంచి క్లైమాక్స్ లోని ప్యాచ్ వర్క్ షూట్ ను చేయనున్నట్టు సమాచారం. ఈ షూటింగ్ లో అఖిల్ తో పాటూ మిగిలిన క్యాస్టింగ్ కూడా పాల్గొనబోతుందట. ఓ వైపు ప్యాచ్ వర్క్ చేస్తూనే టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేస్తుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే(bhagya sri borse) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అఖిల్- భాగ్య శ్రీ మధ్య మంచి వచ్చే లవ్ సీన్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఏజెంట్ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి లెనిన్ అఖిల్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.






