Raja Saab: రూ.400 కోట్ల బడ్జెట్.. 55 శాతం వసూళ్లు.. డిజాస్టర్‌గా ప్రభాస్ ‘రాజాసాబ్’?.. ప్రభాస్‌కు ‘R’ సెంటిమెంట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా హారర్ కామెడీ చిత్రం ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకునేలా కనిపిస్తోంది. జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఆరంభంలో కొన్ని వసూళ్లు రాబట్టినప్పటికీ, లాంగ్ రన్లో నిలబడలేకపోయింది. సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా బిజినెస్ కేవలం 55 శాతం వసూళ్లతోనే ముగిసే అవకాశం ఉంది.
థియేటర్లలో దారుణమైన పరిస్థితి
భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రస్తుతం థియేటర్లలో 20 శాతం ఆక్యుపెన్సీ కూడా దక్కడం లేదని తెలుస్తోంది. సాధారణంగా సంక్రాంతి సీజన్లో సినిమాలు కనీసం రెండు వారాల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగుతాయి. కానీ రాజాసాబ్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్‌గా నిలవాలంటే ఇంకా దాదాపు రూ. 90 కోట్ల (నెట్) వసూళ్లు రావలసి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం రావడం అసాధ్యమని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నిర్మాతల ఆవేదన.. ఓటీటీ దెబ్బ
దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా ఫలితంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఓటీటీ (OTT) హక్కుల విషయంలో కూడా అనుకున్న స్థాయిలో డీల్ కుదరలేదని ప్రొడ్యూసర్ పేర్కొన్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ నిరాశాజనకంగా ఉండటంతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా తక్కువ ధరకే ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘R’ సెంటిమెంట్ మళ్లీ నిజమైందా?
ఈ చిత్ర ఫలితంతో ప్రభాస్ అభిమానులు మళ్లీ ‘R’ అక్షరం సెంటిమెంట్‌ను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో రాఘవేంద్ర, రెబల్, రాధేశ్యామ్ చిత్రాలు కూడా ఇదే అక్షరంతో మొదలై నిరాశపరిచాయి. ఇప్పుడు అదే జాబితాలోకి రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం రాజాసాబ్ కూడా చేరడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ, దర్శకుడు మారుతి దానిని సరైన పద్ధతిలో స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు






