Sumanth: కీర్తితో ఇప్పటికీ మాట్లాడుతుంటా
టాలీవుడ్ హీరో సుమంత్(sumanth) రీసెంట్ గా తన పెళ్లి, విడాకులు మరియు తన వ్యక్తిగత అంశాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. 2004లో కీర్తి రెడ్డి(keerthi reddy)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్, ఆ తర్వాత కొన్ని కారణాలతో 2006లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత ఇద్దరూ ఎవరి లైఫ్ వారు బిజీ అయిపోయారు.
సుమంత్ ఇప్పటికీ సింగిల్ గానే ఉంటే, కీర్తి మాత్రం మరో పెళ్లి చేసుకుని బెంగుళూరులో సెటిలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను పెళ్లికి ముందే అన్నీ విషయాలను కీర్తితో చెప్పానని, తనకు సీక్రెట్స్ మెయిన్టెయిన్ చేయడం ఇష్టముండదని చెప్పాడు. విడాకులు తీసుకున్నప్పటికీ, కీర్తితో తరచుగా మాట్లాడుతుంటానని, తామిద్దరం మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని సుమంత్ చెప్పుకొచ్చాడు.
కీర్తికి మంచి ఫ్యామిలీ దొరికిందని, ఆమె సంతోషంగా ఉన్నందుకు తానెంతో ఆనందిస్తున్నట్టు చెప్పిన సుమంత్, తనకు మరో పెళ్లి ఆలోచన లేదని, ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని, ఫ్యూచర్ లో పెళ్లి విషయంలో తన ఆలోచన మారితే సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న అమ్మాయిని లైఫ్ పార్టనర్ గా చేసుకుంటానని సుమంత్ చెప్పాడు. హీరోయిన్స్ లో దీపికా పదుకొణె(Deepika padukone) అంటే ఇష్టమని చెప్పాడు సుమంత్.






