Revanth Reddy: జ్యూరిక్ లో సీఎం రేవంత్ రెడ్డి కి ఘనస్వాగతం
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బదం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ (Zurich) చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో సీఎంకు ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. జ్యూరిక్ నుంచి రేవంత్ బదం దావోస్‌కు (Davos) వెళ్లనుంది. అక్కడ నాలుగురోజుల పాటు సమావేశాల్లో పాల్గొననుంది. వివిధ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) 2047 రోడ్ మ్యాప్‌తో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను రేవంత్‌రెడ్డి వారికి వివరించనున్నారు.






