Supreme Court: సీబీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు … తదుపరి దర్యాప్తు అవసరముందా? లేదా?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరముందా? లేదా? అని సీబీఐ (CBI) ని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. దర్యాప్తు అవసరముంటే ఎవరెవరిని విచారించాలో స్పష్టం చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె సునీత (Sunita) దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏయే అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని, ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని అనుకుంటున్నారో చెబితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను వచ్చేనెల 5కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.






