Chandrababu:యూఏఈ ఆర్థిక మంత్రి అల్ మార్రీతో సీఎం చంద్రబాబు భేటీ
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) యూఏఈ ఆర్థిక మంత్రి అల్ మార్రీ (Al Marri)తో భేటీ అయ్యారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు, ఏపీ-యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్య బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్లో యూఏఈ (UAE)తో కలిసి పనిచేసేందుకు అంగీకారం కుదిరింది. యూఏఈకి చెందిన 40 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని అల్ మార్రీ పేర్కొన్నారు. ఆహార భద్రత, లాజిస్టిక్స్ (Logistics), పోర్ట్ అధారిత పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది. పునరుత్పాదక శక్తి, పట్టణాభివద్ధి, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చించారు.






