SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హరీశ్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆరఎస్ ఎమ్మెల్యే హరీశ్ (Harish Rao) రావుకు సిట్ (SIT) అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తమ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హరీశ్‌రావు జిల్లా పర్యటనలో ఉండటంతో సిట్ సిబ్బంది నోటీసులను కోకాపేట (Kokapet)లోని ఆయన ఇంట్లో ఇచ్చి వెళ్లారు. దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసు దర్యాప్తులో భాగంగా బీఆరఎస్ అగ్రనేతను విచారించేందుకు నోటీసు జారీ చేయడం ఇదే ప్రథమం. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. బీఆరఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, వ్యాపారులు మొదలు జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 2024 మార్చిలో కేసు నమోదైంది.






