Yellamma: ఎల్లమ్మలో హీరో తండ్రి పాత్రలో సీనియర్ హీరో
కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి చాలా ముందుగానే వార్తల్లో నిలుస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఎల్లమ్మ(Yellamma) కూడా ఒకటి. అప్పటివరకు కమెడియన్ గా ఉన్న వేణు ఎల్దండి(venu Yeldhandi), సడెన్ గా డైరెక్టర్ గా మారి బలగం(Balagam) సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. బలగం తర్వాత వేణు రెండో సినిమాగా దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో ఎల్లమ్మ రానుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు.
ఎల్లమ్మ కథ చాలా రోజుల కిందటే రెడీ అయినప్పటికీ హీరో ఎవరనేది తెలియడానికి టైమ్ పట్టింది. ముందు ఈ కథ నాని(Nani) వద్దకు వెళ్లింది. తర్వాత నితిన్(nithin) వద్దకు వెళ్లింది. ఇప్పుడు ఆఖరిగా ఎల్లమ్మను మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) హీరోగా రాబోతుంది. రీసెంట్ గా దేవీ శ్రీ ని హీరోగా అనౌన్స్ చేస్తూ సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, ఈ మూవీలో దేవీ శ్రీ పర్సి అనే పాత్రలో కనిపించనున్నారు.
అయితే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఎల్లమ్మ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు రాజశేఖర్(rajasekhar). ఎల్లమ్మలో రాజశేఖర్ హీరో తండ్రిగా కనిపించనన్నారని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా హీరోగా దేవీ కి ఎలాంటి డెబ్యూని అందిస్తుందో చూడాలి. హీరోగా నటిస్తూనే దేవీ శ్రీ ఎల్లమ్మకు మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు.






