Mirai: టీవీలోకి రానున్న మిరాయ్.. ఎప్పుడంటే?
హను మాన్(hanu Man) సినిమాతో తేజ సజ్జా(Teja Sajja) ఏ స్థాయిలో గుర్తింపు పొందాడో తెలిసిన విషయమే. అప్పటివరకు కేవలం టాలీవుడ్ వరకే పరిమితమైన తేజ, హను మాన్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో అందరికీ తెలిశాడు. హను మాన్ మూవీతో వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవాలని తేజ చాలా జాగ్రత్తపడి, తర్వాతి సినిమాల విషయంలో బాగా కేర్ తీసుకున్నాడు.
అందులో భాగంగానే వచ్చిన మిరాయ్(Mirai) సినిమాకు కూడా తేజ సజ్జా చాలా కష్టపడ్డాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా మొదలైన మిరాయ్, హను మాన్ తర్వాత భారీ సినిమాగా మారి భారీగానే రిలీజవగా, ఆడియన్స్ మిరాయ్ కు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీవీ ప్రీమియర్ కు రెడీ అయింది.
కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25, 2026 సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కానున్నట్టు ఛానెల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా బాగా సక్సెస్ అయింది. మరి ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్స్ లో ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.






