Salaar2: సలార్2పై త్వరలోనే అప్డేట్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఓ వైపు ఫౌజీ(Fauji) సినిమాను పూర్తి చేస్తూనే, మరోవైపు సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) దర్శకత్వంలో స్పిరిట్(spirit) ను చేస్తున్నారు ప్రభాస్. ఇవి కాకుండా ప్రభాస్ లైనప్ లో పలు భారీ సినిమాలున్నాయి. అవే సలార్2(salaar2), కల్కి2(kalki2). ఈ రెండింటిలో సలార్2 కు స్పెషల్ క్రేజ్ ఉంది. ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో తెరకెక్కిన సలార్(salaar) కు సీక్వెల్ గా ఇది రానుంది.
వాస్తవానికి ఎప్పుడో రావాల్సింది కానీ లేటవుతూ వచ్చింది. అయితే సలార్2 కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఇప్పుడో భారీ అప్డేట్ రానున్నట్టు తెలుస్తోంది. సలార్2 కు మేకర్స్ ఆల్రెడీ రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది చిత్ర నిర్మాతలు త్వరలోనే అప్డేట్ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ అప్డేట్ కూడా చాలా దగ్గరలోనే ఇవ్వనున్నారని, జనవరి 25 లేదా 26న సలార్2 కు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. హోంబలే ఫిల్మ్స్(Hombale Films) బ్యానర్ ప్రభాస్ తో మూడు సినిమాలను లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సలార్2 2026లో వస్తుందని ప్రామిస్ చేశారు. మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సలార్2(salaar2) ను ఈ ఇయర్ లోనే రిలీజ్ చేస్తారేమో చూడాలి.






