ChiruBobby2: బాబీ, చిరూ మళ్లీ మరోసారి అదే చేయబోతున్నారా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) తాజాగా మన శంకరవరప్రసాద్ గారు(Mana shankaravaraprasad Garu) అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(venkatesh) క్యామియో చేయగా, ఆ రోల్ కు మంచి ఆదరణ దక్కింది.
దీంతో ఇప్పుడు ఇదే ఫార్ములాను చిరంజీవి తన నెక్ట్స్ మూవీకి కూడా అప్లై చేయబోతున్నట్టు తెలుస్తోంది. చిరూ(chiru) తన తర్వాతి సినిమాను బాబీ కొల్లి(bobby kolli) దర్శకత్వంలో చేయనుండగా, ఆ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ఉందని, ఆ పాత్ర సినిమా కథలో చాలా కీలకంగా ఉండనుందని, ఆ కీలక పాత్రలో ఓ యంగ్ హీరోను నటింపచేయాలని బాబీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ స్పెషల్ క్యారెక్టర్ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుందని అంటున్నారు. మరి చిరూ- బాబీ సినిమాలో ఏ హీరో నటిస్తాడో చూడాలి. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వాల్తేరు వీరయ్య(waltair veerayya) అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అవగా, ఆ సినిమాలో మాస్ మహారాజా రవితేజ(ravi teja) కీలక పాత్రలో కనిపించాడు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరూ, బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అందరికీ ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలున్నాయి.






