Rashmika: అలా చేయడానికి నేనేమీ హీరోని కాదు
గతేడాది కుబేర(kuberaa), ది గర్ల్‌ఫ్రెండ్(The Girl friend) సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకున్న రష్మిక మందన్నా(Rashmika Mandanna) సినిమాలతోనే కాకుండా పలు ఇంటర్వ్యూల ద్వారా కూడా రెగ్యులర్ గా ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఓ చిట్ చాట్ లో పాల్గొన్న రష్మిక పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తన కెరీర్ మొదలైన 2016 నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉన్నానని, అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తూ, అన్ని భాషల్లోనూ నటించాలనేదే తన కోరిక అని రష్మిక చెప్పింది.
భాష పరంగా తనకు ఎలాంటి హద్దులు లేవని, తాను నటినని, నటిగా అన్ని రకాల ఆడియన్స్ ను అలరించడమే తన పని అని, ఒక్కొక్కరికి ఒక్కో జానర్ సినిమా నచ్చుతుందని, అందుకే తాను అన్నీ విధాలైన సినిమాలు చేసి అందరినీ మెప్పించాలనుకుంటున్నట్టు రష్మిక చెప్పుకొచ్చింది. నెగిటివిటీ గురించి మాట్లాడుతూ, కొందరు కావాలనే డబ్బు కోసం రూమర్లను క్రియేట్ చేస్తారని రష్మిక అంటోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మొదట్లో రూమర్లు విని చాలా బాధ పడ్డానని, తర్వాత వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని, జీవితంలో జరిగిన ప్రతీ విషయం నుంచి ఏదొకటి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నట్టు రష్మిక చెప్పింది. హీరోయిన్లు అందరిలో తానే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానని వస్తున్న వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడానికి తానేమీ హీరోని కాదని చెప్పుకొచ్చింది.






