Srinivasa Mangapuram: శ్రీనివాస మంగాపురం షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ కృష్ణ(krishna) మనవడు, ఘట్టమనేని రమేష్(Ramesh babu) కొడుకు, మహేష్ బాబు(mahesh babu) అన్న కొడుకు టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఘట్టమనేని జయకృష్ణ (Ghattamaneni jayakrishna) హీరోగా ఓ సినిమా రాబోతుంది. అదే శ్రీనివాస మంగాపురం. ఆర్ఎక్స్ 100(RX100), మహా సముద్రం(Maha Samudram), మంగళవారం(mangalavaram) ఫేమ్ అజయ్ భూపతి (Ajay Bhupathi), జయకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతల్ని తీసుకున్నాడు.
ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ ను మొదలుపెట్టుకున్న శ్రీనివాస మంగాపురం(Srinivasa mangapuram) కోసం డైరెక్టర్ అజయ్ భూపతి ఓ లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి జరగనున్న ఈ షెడ్యూల్ లో హీరో జయకృష్ణపై కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటూ ఒక పాటను కూడా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ పాటలో జయకృష్ణ క్యారెక్టర్ ఆర్క్ ను ఎస్టాబ్లిష్ చేస్తారని టాక్.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అశ్వినీదత్(Aswinidutt) సమర్పణలో కిరణ్(Kiran) ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఓ కీలక షెడ్యూల్ పూర్తైంది. తిరుపతి నేపథ్యంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఈ కథ కొనసాగుతుందని, విష్ణువు స్వయంభుగా వెలిసిన ఈ క్షేత్రంగా ఓ సంఘటన ఆధారంగా సాగే ఈ కథ చాలా కొత్తగా ఉంటూ ఆడియన్స్ ను ఎగ్జైట్ చేసేలా ఉంటుందని తెలుస్తోంది.






