Anaganaga oka raju: రాజు గారిని ఆదర్శంగా తీసుకుంటారా?
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చిత్ర పరిశ్రమకు మంచి మద్దతు లభిస్తుంది. స్టార్ హీరో పవన్ కళ్యాణే(pawan kalyan) డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో ఇండస్ట్రీకి ఎలాంటి సమస్యలు తలెత్తుకుండా చూసుకుంటున్నారు. అంతేకాదు, సినిమా షూటింగ్స్ కోసం మేకర్స్ ఏపీకి రావాలని కూడా పలుమార్లు బహిరంగంగానే ఆహ్వానించారు.
అయితే ఏపీ అధికారులు ఏదో ఊరికే మాటవరుసకి పిలిచారులే అని టాలీవుడ్ లోని వారంతా లైట్ తీసుకున్నారు కానీ నవీన్ పోలిశెట్టి(naveen polishetty) సినిమా అనగనగా ఒక రాజు(anaganaga oka raju) మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సినిమాకు సంబంధించిన షూటింగ్ ను స్టూడియోస్ లోనో, సెట్స్ లోనో కాకుండా ఏపీలోని గోదావరి ఏరియాకు వెళ్లి సినిమాను షూట్ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అలా చేయడం చిత్ర యూనిట్ కు అన్ని విధాలా కలిసొచ్చింది. సినిమాను రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల ఆడియన్స్ కు మరింత కనెక్ట్ అవడంతో పాటూ, సినిమా షూటింగ్ కు కూడా అన్ని విధాలా సపోర్ట్ దక్కడం మరియు రిలీజ్ టైమ్ లో కూడా వెంటనే అన్నింటికీ పర్మిషన్లు లభించాయి. సో ఎటు చూసుకున్నా నవీన్ సినిమాకు లాభమే జరిగింది. ఇదంతా చూసి అయినా మరి మిగిలిన చిత్ర నిర్మాతలు ఏపీలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారేమో చూడాలి.






