Rashmika Mandanna: ఈసారి మొత్తం జపనీస్ లో మాట్లాడతా
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విపరీతమైన కలెక్షన్లను అందుకోవడమే కాకుండా చాలా రికార్డులను కూడా సృష్టించింది. ఇండియాలో ఎన్నో రికార్డులను సృష్టించిన పుష్ప2 ఇప్పుడు జపాన్ లో పుష్ప క్రునిన్ పేరుతో రిలీజైంది.
పుష్ప2 జపాన్ లో రిలీజైన సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ తో కలిసి రష్మిక పాల్గొని అక్కడి ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా జపనీస్ లో మాట్లాడి అందరినీ ఇంప్రెస్ చేసింది. తన జపాన్ టూర్ కు సంబంధించి సోషల్ మీడియాలో రష్మిక ఓ పోస్ట్ ను కూడా చేసింది. మీ అభిమానం, దయ ఎప్పటికీ మారవని, జపాన్ కు వచ్చిన ప్రతీసారి మరింత కృతజ్ఞతతో తిరిగి వెళ్తానని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది రష్మిక.
టూర్ లో భాగంగా తనకు వచ్చిన ప్రతీ లెటర్, గిఫ్టును చూశానని, జపాన్ కు మళ్లీ వస్తానని, ఈసారి ఎక్కువ రోజులుండేలా ప్లాన్ చేసుకుంటానని, ఈసారి వచ్చినప్పుడు మాత్రం జపనీస్ బాగా నేర్చుకుని వస్తానని రష్మిక ప్రామిస్ చేస్తూ ఒక్క రోజులో ఇంత ప్రేమను అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. కాగా రష్మిక ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
https://www.instagram.com/p/DTqIpvsk69O/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==






