Subhakruth Nama Samvastram: ‘శుభకృత్ నామ సంవత్సరం’ అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా – నరేష్
నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శుభకృత్ నామ సంవత్సరం’. ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వి పిక్చర్స్, అవిష్క డ్రీ ప్రొడక్షన్ బ్యానర్స్ పై డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్లో నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మా కుటుంబంలో సగమైన ఫ్యాన్స్ కి పేరుపేరునా కృతజ్ఞతలు. మా కుటుంబంలో ఏదైనా సరే మాతో వచ్చి నిలబడే ఫ్యాన్స్ ని కృష్ణ గారు మాకు ఇచ్చి వెళ్లారు. రామోజీరావు గారు జంద్యాల గారు నాకు ఒక ఫ్యామిలీ. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు మరో ఫ్యామిలీ లాగా వచ్చారు. నాకోసం ఒక క్యారెక్టర్ రాయడం అనేది నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. శ్రీ విష్ణు మై హీరో. మహేష్ తర్వాత అంత మంచి షటిల్ గా ఉండే టైమింగ్ తనలో చూశాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా ముందుకు వెళ్తున్న కొద్ది లీడ్ రోల్స్ కూడా మొదలయ్యాయి. అయితే నేను ప్రతిదీ క్యారెక్టర్ గానే చూస్తాను. నాకు అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చిన ప్రతి డైరెక్టర్ కి పేరున కృతజ్ఞతలు. తెలుగు కన్నడ సిస్టర్ లాంగ్వేజ్. ఒకటే లిపి ఉంటుంది. కల్చర్ దగ్గరగా ఉంటుంది. శుభకృత్ నామ సంవత్సరం కథ చాలా నచ్చింది. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. ఇది డ్రామా సస్పెన్స్ ట్రావెల్ అన్ని అద్భుతంగా ఉంటాయి. చాలా వేరియేషన్స్ ఉన్న సినిమా.
తెలుగు కన్నడలో చాలా మంచి స్టార్ కాస్ట్ తో వస్తున్న సినిమా ఈ టైటిల్ వినగానే అందరూ చాలా పాజిటివ్ గా ఉంది అంటున్నారు. అద్భుతమైన విజయం సాధించే అన్ని అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు కన్నడలో చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ప్రతి సంవత్సరం మన తెలుగు సినిమా కళకళలాడాలి. నారీ నారీ సినిమాకు సింగిల్ స్క్రీన్ ధియేటర్ కి వెళ్దామని అనుకున్నాను. అన్నీ హౌస్ ఫుల్ వున్నాయి, ఫస్ట్ టైం నా సినిమాకి నాకు టికెట్స్ దొరకలేదు. షాక్ అయ్యాను. మల్టీప్లెక్స్ లో కూడా కేకలు అరుపులతో సినిమా చూస్తున్నారు. ఆ రెస్పాన్స్ చూసి చాలా షాక్ అయ్యారు. మంచి ఎంటర్టైన్మెంట్ కి ఇండస్ట్రీలో ది గ్రేట్ టైం. పరిశ్రమలో 54 ఏటా పెట్టాను. ఇంత బిజీ లో, ఇంకా రైజ్ లో ఉన్నాను అంటే అదంతా నా హీరోలు దర్శకులు నిర్మాతల పెద్ద వాళ్ళ ఆశీర్వాదం. ఈ సినిమా కొన్ని సంవత్సరాలు పాటు గుర్తుండిపితుంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ శుభ కృత నామ సంవత్సర శుభాకాంక్షలు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. నరేష్ గారు చేస్తున్న ప్రతి రోల్ చూస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ ఇస్తున్నారు. కొత్త డైరెక్టర్స్ ని ప్రోత్సహిస్తున్నారు. నరేష్ గారు సినిమాలో ఉంటే చాలు అనే ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఏ పాత్ర అయినా సరే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు పరిశ్రమంలో ఉండడం చాలా గర్విస్తున్నాను. ఆయన ఇంకా మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. సామజ వరగమన నాకు మంచి పేరు తీసుకొచ్చింది. నరేష్ గారికి ఇంకా మంచి పేరు తీసుకొచ్చింది ఆ సినిమా తర్వాత ఏ కథ వచ్చిన ఫాదర్ గా నరేష్ గారే అంటున్నారు. దానికంటే ఒక గొప్ప కథ వచ్చినప్పుడు చేస్తానని ఎదురు చూశాను. అలాంటి సినిమా మా కాంబినేషన్లో చూడబోతున్నా.రు ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. నరేష్ గారు లాంటి గొప్ప వ్యక్తితో జీవించడం దేవుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను. నరేష్ గారు ప్రతి క్యారెక్టర్ కి ఎంతో ప్రిపేర్ అవుతారు. చిన్న పెద్దా అని ఉండదు. అన్నీ ఒకేలా చూస్తారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నరేష్ గారు ఒక కింగ్ లాగా బ్రతుకుతారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని ఆయన ఫిలాసఫీ. ఈ గ్లిమ్స్ చూస్తే ఆ పాత్రలో నరేష్ గారే కనిపించారు. ఈ సినిమా తెలుగు కన్నడలో చేయడం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది.
డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ… అందరికీ గుడ్ ఈవెనింగ్. నరేష్ గారికి హ్యాపీ బర్త్డే, కంగ్రాజులేషన్స్. ఆయన యాభై నాలుగు ఏళ్ల అద్భుతమైన ప్రయాణంలో మేము కూడా భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నారి నారి సక్సెస్ కి కంగ్రాట్స్. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇందులో నరేష్ గారు లుక్కు చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. ఆయన ఇలాగే మళ్లీమళ్లీ హిట్లు కొడుతూ, అందరికీ అవకాశాలు ఇస్తూ ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
డైరెక్టర్ సజ్జన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నరేష్ గారి గోల్డెన్ ఇయర్ సినిమా చేయడం నా అదృష్టం. నేను ఇప్పటివరకూ నాలుగు సినిమాకు చేశాను. లాస్ట్ ఫిలిం కి కర్ణాటక బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఈ సినిమాలో నరేష్ గారు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయనకి కథ చాలా నచ్చింది. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. మీ అందరికీ కచ్చితంగా అలరించేలా ఉంటుంది.
ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. నరేష్ గారితో నాకు 20 ఏళ్లుగా స్నేహం ఉంది. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సామాజిక కార్యక్రమాల్ని చేపట్టారు. ఎన్నో అద్భుతమైన పోరాటాలు చేశారు. అనంతపూర్ జిల్లాలో పుట్టిన వాళ్ళ కంటే ఆ ప్రజల పట్ల ఎక్కువ ప్రేమ అభిమానులు చూపిన వ్యక్తి నరేష్ గారు. రాజకీయాల తర్వాత సినిమాకి అంకితమయ్యారు .ఎన్నో విజయాలలో భాగస్వామ్యం అయ్యారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాజేష్ దండా మాట్లాడుతూ.. నరేష్ గారు ఎప్పుడు కూడా ఈ కథ గురించి చెప్తుండేవా.రు సినిమా చాలా అద్భుతంగా వస్తుంది. నారీ నారీ నడుమ మురారి సినిమాలో ఆయన కామెడీ చూడ్డానికి జనం రెండోసారి వెళ్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి టీమ్ అందరికీ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
నిర్మాత విశ్వనాధ్ నాయక్ మాట్లాడుతూ.. నాకు ఈ ఇండస్ట్రీలో సినిమా చేసే అవకాశం ఇచ్చిన నరేష్ గారికి ధన్యవాదాలు. చాలా మంచి కథతో ఈ సినిమా తీస్తున్నాం. మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరించేలా ఉంటుంది. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.






