Jana Nayagan: జన నాయగన్ పై పూటకో వార్త
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) చివరి సినిమాగా వస్తున్న జన నాయగన్(jana nayagan) ఈ మూవీపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ముందు అనుకున్న ప్రకారమైతే జన నాయగన్ జనవరి 9న రిలీజ్ కావాల్సింది కానీ ఆ సినిమా సెన్సార్ జాప్యం కారణంగా ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ రావడం లేదు.
అయితే ఈ సినిమా రిలీజ్ కు దగ్గరలో మూడు స్లాట్ లు మాత్రమే ఉన్నాయి. అవే జనవరి 30, ఫిబ్రవరి 6 లేదా ఫిబ్రవరి 13. ఈ మూడు రోజుల్లో ఏదొక రోజును జననాయగన్ ఎంచుకోవాలి లేదంటే మళ్లీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి జూన్ తర్వాత వరకు సినిమాను రిలీజ్ చేయడానికి ఉండదు. కాబట్టి వీలైనంత త్వరగా జననాయగన్ రిలీజ్ అవాలి. కానీ మేకర్స్ కు ఇంకా కోర్టు నుంచి క్లియరెన్స్ రాలేదు.
ఇవన్నీ తెలిసి కూడా జననాయగన్ కచ్ఛితంగా ఫిబ్రవరిలోనే వస్తుందని కొందరంటుంటే, మరికొందరు మాత్రం దీపావళి వరకు ఆగి పండగ సీజన్ లో సినిమాను రిలీజ్ చేయాలని, అప్పుడైతే సినిమాకు మంచి ఓపెనింగ్స్ తో పాటూ మూవీ చాన్నాళ్ల పాటూ గుర్తుండిపోతుందని అంటున్నారు. దీంతో మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే విజయ్ అంటే గిట్టని వారు మాత్రం ఈ సినిమా ఫిబ్రవరి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తుందని పుకార్లు పుట్టిస్తున్నారు. మరి జననాయగన్ మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలో త్వరగా క్లారిటీ ఇస్తే తప్ప ఈ వార్తలు ఆగేలా లేవు.






