అమెరికాలోకి నాట్కో ఔషధాలు
అమెరికా మార్కెట్లో వ్యాపార వృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు నాట్కో, ఫార్మా చైర్మన్ ఎండీ వీసీ నన్నపనేని వెల్లడించారు. అక్కడి మార్కెట్లో ఔషధాల పోర్టు ఫోలియోను పెంచుకునేందుకు ప్రత్యేకంగా దృష్టిని సారిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా మార్కెట్ల్లోకి అధిక విలువ కలిగిన ఔషధాలను విడుదల చేయనుండటంతో రానున్న సంవత్సరాల్లో మార్కెట్ వాటా పెరగనుందని పేర్కొన్నారు. కాగా అమెరికా మార్కెట్‌పై దృష్టి పెట్టే వ్యూహంలో భాగంగా అక్కడ ఫ్రంట్ ఎండ్ ఎంటైటీ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా నాట్కో పరిశీలిస్తోంది.






