Stock Markets: బడ్జెట్ ప్రకటన వేళ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటనల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) భారీ నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సూచీలు పాతాళానికి పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1,546 పాయింట్లు పతనమై 80,722 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty) 495 పాయింట్లు కోల్పోయి 24,825 వద్ద స్థిరపడింది.
ఇలా స్టాక్ మార్కెట్లు (Stock Markets) దారుణంగా పడిపోవడానికి పలు కారణాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడం మదుపర్లను ఆందోళనకు గురిచేసింది. దీనివల్ల ట్రేడింగ్ ఖర్చులు పెరుగుతాయని ఇన్వెస్టర్లు భయపడ్డారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) ఇప్పటికే మార్కెట్ (Stock Markets) నుండి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. వారిని ఆకర్షించేందుకు బడ్జెట్లో ఎలాంటి బలమైన చర్యలు లేకపోవడం నిరాశ కలిగించింది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లో (Stock Markets) రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) వంటి హెవీ వెయిట్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్ స్టాక్స్ కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.






