Shivani Nagaram: ట్రెండీ అవుట్‌ఫిట్ లో తెలుగమ్మాయి అందాలు
తెలుగమ్మాయిల సందడి ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో బాగానే ఎక్కువైంది. తెలుగమ్మాయిగా పరిచయమైన శివానీ నగరం(Shivani Nagaram) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. లిటిల్ హార్ట్స్(Little Hearts) మూవీతో మంచి యాక్టింగ్ ను కనబరిచి, అందరినీ తన దృష్టితో ఆకర్షించిన శివానీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా అమ్మడు తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శివానీ స్టైలిష్ అవుట్‌ఫిట్ లో మరింత స్టైలిష్ గా పోజులిస్తూ కనిపించగా, ఈ అవుట్ ఫిట్ శివానీని మరింత గ్రాండ్ గా ఎలివేట్ అయ్యేలా చేసిందని నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.






