Union Budget 2026: ఊరించి, ఉసూరుమనిపించి.. స్టాక్ మార్కెట్లకు రుచించని బడ్జెట్
Union Budget 2026:కేంద్ర బడ్జెట్ 2026లో వెల్లడించిన కొన్ని ప్రతిపాదనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ముఖ్యంగా కంపెనీల షేర్ల బైబ్యాక్‌పై పన్ను విధించడం, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్కెట్లను కుదిపేసింది.
తాజా పరిస్థితి:
సెన్సెక్స్: మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి సెన్సెక్స్ సుమారు 1367 పాయింట్లు నష్టపోయి 80,675 స్థాయి వద్ద కొనసాగుతోంది. ఒకానొక దశలో ఇది ఏకంగా 2000 పాయింట్ల వరకు పడిపోయింది.
నిఫ్టీ: నిఫ్టీ సైతం 535 పాయింట్ల మేర పతనమై 24,785 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ మధ్యలో నిఫ్టీ 700 పాయింట్లకు పైగా క్షీణించి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
ట్రేడింగ్ నిబంధనల్లో మార్పులు, పన్నుల పెంపు కారణంగా అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్లు కోలుకోవడానికి కష్టపడుతున్నాయి.






